గ్రేటర్‌లోని బడులకు ఆదరణేది?
రాష్ట్ర జనాభా దాదాపు 3.8 కోట్లు. గ్రేటర్ జనాభా 1.3కోట్లు. అంటే 35% జనాభా గ్రేటర్‌లోనే నివసిస్తున్నది. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు 20.31లక్షలు. అదే గ్రేటర్‌లోని సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు కేవలం 2.70లక్షలే. అంటే 10% మాత్రమే అన్నమాట. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలో సర్కార్ బడుల్లో కేవలం 2,70,939 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నట్టు విద్యాశాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి.
- ‘క్యూర్’ సర్కార్ బడుల్లో చదువుతున్నది 2.7లక్షలే!
హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్ర జనాభా దాదాపు 3.8 కోట్లు. గ్రేటర్ జనాభా 1.3కోట్లు. అంటే 35% జనాభా గ్రేటర్‌లోనే నివసిస్తున్నది. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు 20.31లక్షలు. అదే గ్రేటర్‌లోని సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులు కేవలం 2.70లక్షలే. అంటే 10% మాత్రమే అన్నమాట. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలో సర్కార్ బడుల్లో కేవలం 2,70,939 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నట్టు విద్యాశాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. 1.3 కోట్ల జనాభా ఉంటే.. కేవలం 2.7లక్షల మందే సర్కార్ బడుల్లో చదువుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కోటిన్నర జనాభాకు చేరువవుతున్న గ్రేటర్‌లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లోనే ఉండటం గమనార్హం. పట్టణాల్లోని సర్కార్ స్కూళ్లల్లో 4,29,212 విద్యార్థులు చదువుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో 13,31,373 మంది విద్యార్థులు చదువుతున్నట్టు విద్యాశాఖ తేల్చింది.
క్యూర్లో విద్యావసతుల కల్పన..
క్యూర్ పరిధిలో విద్యా వసతుల కల్పనను ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రూ. 719.63 కోట్ల అంచనా వ్యయంతో 16 కొత్త స్కూళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా 17 స్కూళ్లను రూ. 364 కోట్లతో అప్‌గ్రేడ్ చేయనున్నది. రూ.150కోట్లు వెచ్చించి 183 అదనపు తరగతి గదులు నిర్మించనున్నది. 2027 జూన్‌లోపు వీటిని పూర్తిచేయాలని సర్కార్ గడువుగా పెట్టుకున్నది. సీఎం ఆదేశాలతో విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా క్యూర్ పరిధిలోని స్కూళ్లల్లో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టారు. సీఎస్సార్ నిధులు సమీకరిస్తున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. 8 కొత్త స్కూళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయి. రంగారెడ్డిలో నాలుగు, మేడ్చల్‌లో రెండు ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. దీంతో గడువులోగా పూర్తయ్యేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

