హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇకపై ఆన్లైన్లోనే లభించనున్నాయి. ఎంబీసీ-34 కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు ఎక్కువసేపు క్యూలైన్లో నిరీక్షించాల్సి వస్తున్నందున ఆన్లైన్లోనే టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపుతున్నారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆన్లైన్లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ అవుతుంది. రెండ్రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నది. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొన్న తర్వాత పూర్తిస్థాయిలో అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనున్నది.