జగిత్యాల రూరల్, జూలై 12 : ఆన్లైన్ గేమింగ్ ఉచ్చు లో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రూ. 1.80 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. జగిత్యాల రూరల్ మం డలంలో చోటుచేసుకొన్నది. అంతర్గాం గ్రామానికి చెందిన కొట్టాల తుక్కయ్య-గంగవ్వ కొడుకు తరుణ్‌రెడ్డి (21) జగిత్యాలలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడ్డాడు. సదరు గేమ్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేశా డు. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు తరుణ్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఆన్లైన్ గేమ్ ఉచ్చులో పడిన తరుణ్ బ్యాంకు ఖాతాలో నుంచి సుమారు రూ.1.80 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఇంట్లో తెలిస్తే ఏమంటారోనని భయాందోళనకు గురై ఈ నెల 10న పొలం వద్దకు వెళ్లి విషం తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.