రామగిరి, ఆగస్టు 14: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28, 2013న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలికపై మన్యంచెల హైదర్‌ఖాన్‌గూడలో జరిగిన లైంగికదాడి, ఆపై హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదుచేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత గురువారం రెండో అదనపు జిల్లా జడ్జి రోజారమణి నిందితుడిని దోషిగా నిర్ధారించి తీర్పు వెల్లడించారు.
తీర్పులో భా గంగా మరణశిక్ష (డబుల్ డెత్, పెనాల్టీ), రూ.1,1 0,000 జరిమానా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. ఈ కేసులో కోర్టులో చార్జిషీట్ దాఖలుచేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ విజయ్‌కుమార్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తదితరులను ఎస్పీ కార్యాలయంలో సన్మానించారు.