జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొందరు యువకులు స్నానం చేసేందుకు ఎస్సారెస్పీ కెనాల్లో దిగారు.
అయితే సంగెం గ్రామానికి చెందిన నల్ల కిషన్ అనే వ్యక్తి కెనాల్లో గల్లంతయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని కిషన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.