సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్పై వెళ్తున్నారు. ఈక్రమంలో ఆకుపాముల సమీపంలో ఎదురుగా బర్రెలు అడ్డువచ్చాయి. దీంతో బైకు అదుపుతప్పడంతో వారు కింద పడిపోయారు.
అదేసమయంలో వచ్చిన లారీ.. యువతి పైనుంచి వెళ్లడంతో ఆమె స్పాట్లో దుర్మరణం చెందారు. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.