సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు,హోమాలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రముఖ ఆలయాల్లో పూజలు, హోమాలు నిర్వహించారు.
నల్లగొండ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రముఖ ఆలయాల్లో పూజలు, హోమాలు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని ఛాయా సోమేశ్వర ఆలయం లో అర్చక సంఘం ఆధ్వర్యంలో మృత్యుంజయ ఆయుష్షు హోమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ
మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి , ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ లింగయ్య యాదవ్ హోమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్ర కుమార్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, పలు కార్పొరేషన్ చైర్మన్ లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఆలయ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి తదితరులు హాజరయ్యారు. 
జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
కొండగట్టు,వేములవాడ ఆలయాల్లో ..
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు. పార్టీ అధ్యక్షుడు పుల్కం రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, జోగినీ శంకర్, నరాల శేఖర్, గోలి మహేష్, కో ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, బాబున్, నాయకులు రామతీర్థపు రాజు, పిచర భాస్కర్ రావు, తీగల వెంకటేశ్వర్ రావు, గూడూరి మధు, నీలం శేఖర్, కుమ్మరి శ్రీనివాస్, పెంట బాబు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మాడిశెట్టి కృపాలు, భాస్కర్, సత్యనారాయణ రెడ్డి, లక్ష్మీరాజం, రాము, పీర్ మహమ్మద్ తదితరులు ఉన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం లో డీసీఎం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మహా మృత్యుంజయ ఆయుశ్య హోమాన్ని నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

