హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగో రోజు శుక్రవారం 22.62 లక్షల ఎకరాలకు సంబంధించి 6.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,131 కోట్లు జమ చేసింది.
దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం 87.54 లక్షల ఎకరాలకు సంబంధించి 57.07 లక్షల మంది రైతులకు రూ.4,377.42 కోట్లు జమ చేసినట్టయింది.