సుల్తాన్‌బజార్, జనవరి 1: ఆంగ్ల సంవత్సరాదిగా జనవరి 1న సంబురాలు జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీగా వస్తున్నది. కొత్త సంవత్సరంలో తొలి రోజు పుట్టిన పిల్లలకు ప్రత్యేకత ఉంటుంది.
కోఠిలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల అనంతరం జనవరి ఒకటిగా తేదీ మారిన తర్వాత 42 మంది శిశువులు పుట్టడం విశేషం. అందులో 23 మంది మగ, 19 మంది ఆడ శిశువులు ఉన్నారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కే రాజ్యలక్ష్మి వెల్లడించారు.