చిక్కడపల్లి, అక్టోబర్ 7: సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవవాన్ని ఈ నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రం టీపీఎస్కే హాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను అశోక్‌తేజ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 ఏండ్లుగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది పురస్కారాన్ని అరుణోదయ విమలక్కకు అందజేస్తున్నామని చెప్పారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు, అశోక్‌తేజ సతీమణి విజయనిర్మల, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.