వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 23: కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వఉద్యోగుల పట్ల మొండి వైఖరిని అవలంభిస్తున్నదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ షరీఫుద్దీన్, టీచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ హరికృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల ఎదుట ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షరీఫుద్దీన్ మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దుచేయాలని, మెడికల్ రీయంబర్స్మెంట్, కరువు భత్యం డీఏను విడుదల చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్స్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. ధర్నాలో ప్రధాన కార్యదర్శి పీ సుదర్శన్, సీనియర్ నాయకులు అంజయ్య, అశోక్, నిరంజన్, రమా, మధుసూదన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.