ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన అరికొట్ల సాభాగ్యమ్మ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నది. రెండో డోసు తీసుకోవట్లేదు. శుక్రవారం వైద్యసిబ్బంది టీకా వేసుకోవాలని కోరగా.. వద్దని సౌభాగ్యమ్మ వెక్కివెక్కి ఏడ్చింది. వైద్యసిబ్బంది నచ్చజెప్పి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏడుస్తుండటంతో స్థానికులు ‘నీ పాణం కోసమే అవ్వా..’ అంటూ సముదాయించారు. –చింతకాని