హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : పామాయిల్ గెలల కొనుగోలు లో రైతులకు ఆయిల్‌ఫెడ్ సంస్థ అధిక ధర చెల్లిస్తున్నదని, దీన్ని అడ్డుకునేందు కు పలు ప్రైవేటు కంపెనీలు ఆయిల్‌ఫెడ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. ప్రైవేటు సంస్థల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఆయిల్‌ఫెడ్‌పై దుష్ప్రచారం చేసి రైతుల నుంచి తక్కువ ధరకు పామాయిల్ గెలల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. సోషల్ మీడియా లో ఆయిల్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సరఫరా చేసిన మొక్కలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించింది.
19.42% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో(ఓఈఆర్)తో ఆయిల్‌ఫెడ్ సంస్థ రైతులకు అధి క ధరలు చెల్లిస్తున్నట్టు చెప్పింది. అధిక ధర చెల్లించేందుకు ప్రైవేటు కంపెనీలు ముందుకు రావడం లేదని, అందుకే ఆయిల్‌ఫెడ్ ధరలను తగ్గించేందుకు అసత్య ప్రచారాలకు పూనుకున్నాయని వివరించింది. మూడేండ్ల క్రితం 34,7 20 ఎకరాల్లో మాత్రమే ఉన్న ఆయిల్‌ఫెడ్ పామాయిల్ విస్తీర్ణం, ప్రస్తుతం 1.44 లక్షల ఎకరాలకు పెరిగిందని, ఇదే విషయం సంస్థపై రైతులకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదన్నారు.