హైదరాబాద్ : ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఒగ్గు కళాకారులు హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన వారు ఎల్లమ్మ, మల్లన్నల పసుపు, కుంకుమ, ప్రసాదాలను మంత్రికి అందచేశారు.
ఒగ్గు పూజారులు తమ సంప్రదాయ పద్ధతిలో ఒగ్గు (ఢమరుకం) మోగిస్తూ మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఒగ్గు రవి నేతృత్వంలోని ఒగ్గు కళాకారుల బృందం పాల్గొంది. కాగా, మంత్రి ఎర్రబెల్లి వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.