Tirumala | తిరుపతి జూ నుంచి నల్లమల అభయారణ్యంలోకి.. వేట తర్ఫీదుకు పులిపిల్లలు!
నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూపార్లో ఆశ్రయం పొందుతున్న పులిపిల్లలకు వేట శిక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పులిపిల్లలు స్వతహాగా వేటాడి ఆహారం సేకరించుకోవడంపై తర్ఫీదునిచ్చేందుకు నల్లమల అడవిలో భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
- కాకినాడ నుంచి 37 చారల దుప్పులూ తరలింపు!
- 15 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధం
Tirumala | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూపార్లో ఆశ్రయం పొందుతున్న పులిపిల్లలకు వేట శిక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పులిపిల్లలు స్వతహాగా వేటాడి ఆహారం సేకరించుకోవడంపై తర్ఫీదునిచ్చేందుకు నల్లమల అడవిలో భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోగా, స్థానికుల సహాయంతో అటవీశాఖ సిబ్బంది తిరుపతిలోని వేంకటేశ్వర జూపారుకు తరలించారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల చనిపోగా.. మిగతా పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేసి సంరక్షిస్తున్నారు. ప్రసుతం అవి అభయారణ్యంలో వేట నేర్చుకునేందుకు వీలుగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను ఇప్పటికే సిద్ధం చేశారు.
తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారి పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజ్ పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటుచేశారు. వేట తర్ఫీదు పొందేలా 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేలా ఎన్‌క్లోజర్ చలువ పందిళ్లు, నీటి స్ప్రింక్లర్లను ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

