హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం ప్రదర్శించారు. పంచాయతీ, మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, 28న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
తుది జాబితా ఆధారంగానే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్టు పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముసాయిదా జాబితాను పరిశీలించుకోవాలని, గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉండదని చెబుతున్నారు.