Papikondalu tour | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గోదావరి పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టులో విహారయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం వరదలు లేకపోవడంతో పర్యాటక బోట్లకు అనుమతించారు. బుధవారం బోటులో ఉన్నతాధికారులు పేరంటపల్లికి వెళ్లారు.