Parigi | పరిగి, నవంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో ఇది మరింత శ్రుతి మించుతున్నది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గురువారం పరిగిలోని ఎస్సీ, బీసీ బాలికలు, బాలు ర వసతి గృహాల్లో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయగా వారితో కలిసి పరిగి త హసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీడీవో కరీం, ఎంఈవో గోపాల్, దోమ మండలంలోని మైలారంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో కేక్ కట్ చేసి, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొనడం ఏమిటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.