హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పదో తరగతి లాంగ్ మెమోలను అధికారులు బడులకు పంపిణీ చేస్తున్నారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షలతోపాటు, జూన్లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి మెమోలను బడులకు చేర్చుతున్నారు.
రాష్ట్రంలో 11వేల బడులకు సంబంధించిన మెమోలను పంపించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రెండువేల బడులకు మెమోలను చేర్చారు.