దేవరభూములపై జీవోల పరిశీలన

- 4వ రోజూ కొనసాగిన అధికారుల విచారణ
- అవి ముమ్మాటికీ దేవాదాయశాఖ భూములే
- మాజీ మంత్రి ఈటల కనుసన్నల్లోనే కబ్జాలు
- స్పష్టం చేస్తున్న దేవరయాంజాల్ ప్రజలు
మేడ్చల్, మే 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్‌లోని దేవాదాయ భూములపై ఐఏఎస్‌లతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీ నాలుగో రోజు బుధవారం శ్రీసీతారామస్వామి ఆలయంలో విచారణను కొనసాగించింది. భూములకు సంబంధించి ఆలయంలో ఉన్న పలు రికార్డులను సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. వీటిపై గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అక్రమ నిర్మాణలపై సర్వే ఆధారంగా దేవాదాయ, రెవెన్యూ రికార్డులను పరిశీలించింది. కమిటీ ఆదేశాలతో మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 8 మండలస్థాయి అధికారుల బృందాలు సర్వేను పూర్తిచేశాయి. దీని ఆధారంగా భూముల ఆక్రమణలు, వాటిల్లో నిర్మాణాలకు సంబంధించిన సర్వే నంబర్లను అధికారులు నిర్ధారించారు. మొత్తం 91 సర్వే నంబర్లలోని 1,525 ఎకరాల్లో హకీంపేట్ ఎయిర్పోర్ట్, డీఎంసీకి ఇచ్చిన భూములను మినహాయించి.. మిగిలిన భూముల సర్వే పూర్తిచేశారు. ఇందులో 160 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.
అవి ఆలయ భూములే
శామీర్‌పేట మండలంలో దేవరయాంజాల్‌లో గోదాము లు, ఇతర షెడ్లు నిర్మించిన భూములన్నీ శ్రీసీతారామస్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూములేనని గ్రామస్థులు స్పష్టంచేస్తున్నారు. ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని పేర్కొన్నారు. 1925లో తనవద్ద పనిచేసే రామిడి పుల్లయ్య విజ్ఞప్తి మేరకు నిజాంనవాబు సీతారామస్వామి దేవాలయానికి భూములను కేటాయించారని తెలిపారు. అప్పటినుంచి పహణీలో సీతారామస్వామి పేరిటే భూమి ఉండేదని.. తర్వాత ఎలా మారిపోయిందో తమకు తెలియదని చెప్తున్నారు. మాజీ మంత్రి ఈటల కనుసన్నల్లోనే పలు గోదాముల నిర్మాణం జరిగిందని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

