
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(జీఐఎస్ఏఐడీ) తెలిపాయి. భారత్‌లో సాధారణంగా కనిపిస్తున్న ఏ2ఏ, ఏ3ఏ వంటి వేరియంట్ల కన్నా వీటి వ్యాప్తివేగం, తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించాయి. వైరస్‌లో ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్న ఉత్పరివర్తనాలు ప్రమాదాన్ని పెంచుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ‘బి.1.36.29 (ఎన్440కే)’ వేరియంట్ కనిపిస్తున్నట్టు పేర్కొన్నాయి. దీంతోపాటు పలు వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్టు చెప్పాయి.
F బి.1.36.29 (ఎన్440కే) – కొత్తగా నమోదయ్యే కేసుల్లో 36 శాతం వరకు కనిపిస్తున్నది. దీని తీవ్రత ఏ2ఏ వేరియంట్‌తో పోల్చితే 10 రెట్లు, ఏ3ఏ కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ.
F బి.1.1.7 (యూకే స్ట్రెయిన్) – ఇటీవల పాజిటివ్ వచ్చినవారిలో 14 శాతం మందిలో ఇది కనిపిస్తున్నది. ఇది సాధారణ వేరియంట్లతో పోల్చితే 40 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటున్నది.
F బి.1.617 (మహారాష్ట్ర వేరియంట్) – ఇది 10 శాతం కేసుల్లో కనిపిస్తున్నది. అన్ని వేరియంట్ల కన్నా వేగంగా వ్యాప్తిస్తున్నది.
F బి.1.1351 (దక్షిణాఫ్రికా స్ట్రెయిన్) – ఇది అన్నింటికన్నా ప్రమాదకరమై మ్యుటెంట్.