నైనీ బ్లాక్ నుంచి అదనంగా బొగ్గు రవాణా
ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్ నుంచి అదనంగా మరో రెండు గంటలు బొగ్గు రవాణా చేసేందుకు అంగూల్ జిల్లా యంత్రాంగం అంగీకరించింది. ఈ మేరకు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు బొగ్గును రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు అనుమతినిచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఒడిశాలోని నైనీ కోల్‌బ్లాక్ నుంచి అదనంగా మరో రెండు గంటలు బొగ్గు రవాణా చేసేందుకు అంగూల్ జిల్లా యంత్రాంగం అంగీకరించింది. ఈ మేరకు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు బొగ్గును రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు అనుమతినిచ్చింది. నైనీ కోల్‌బ్లాక్ నుంచి ఎంఎంఐఎస్ రైల్వే సైడింగ్ వరకు రోడ్డు మార్గంలో బొగ్గును రవాణా చేస్తున్నారు. అయితే రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జామున 4గంటల వరకే బొగ్గు రవాణాకు అనుమతిస్తున్నారు. దీంతో లక్షిత పరిమాణంలో బొగ్గు రవాణా సాధ్యంకావడంలేదు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు బొగ్గు అవసరాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీశ్ స్వయంగా రంగంలోకి దిగారు. జెన్కో కోల్ అండ్ లాజిస్టిక్స్ డైరెక్టర్ బీ నాగ్యతో కలిసి ఒడిశా వెళ్లి అంగూల్ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు అవసరాలు, రవాణా ఆవశ్యకతను ఆయనకు వివరించారు. రవాణా సమయాన్ని సడలించాలని కోరారు. దీనిపై స్పందించిన అంగూల్ జిల్లా కలెక్టర్ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఆరు గంటల పాటు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాకు అనుమతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

