నాంపల్లి కోర్టులు, జూ లై 10 (నమస్తే తెలంగాణ): ఇటీవలి ఎన్నికల ప్రచారం సందర్భంగా కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను తొలగించడంపై పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీ నిరంజన్ బుధవారం అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన మొఘల్‌పురా పోలీసులు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేంద్ర మంత్రుల పేర్లను తొలగించారు. అయితే తమవద్ద కీలక అధారాలున్నాయని, వాటిని కోర్టుకు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని నిరంజన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కేసును సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తూ 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవిత ఉత్తర్వులు జారీ చేశారు.