హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్డీ ఫైనల్ విద్యార్థులకు మరో మూడు నెలల్లో కోర్సు పూర్తవుతుందని, ఆలోపే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ విద్యార్థులకు అవకాశం దక్కడంలేదని వాపోతున్నారు. నోటిఫికేషన్‌ను వాయిదా వేసి మరో మూడు, నాలుగు నెలల తర్వాత జారీ చేయాలని కోరుతున్నారు. 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం ఉద్యాన వర్సిటీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.