కొలిక్కిరాని ఆపరేషన్ ప్రొటోకాల్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశం ఇంకా కొలిక్కిరాలేదు.
- సీడబ్ల్యూసీ ప్రతిపాదనలపై అభ్యంతరం
- సోమవారానికి సమావేశం వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశం ఇంకా కొలిక్కిరాలేదు. కేంద్ర జలసంఘం రూపొందించిన ముసాయిదాలోని ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్కర్వ్ తదితర అంశాల వారీగా ఇరు రాష్ర్టాలతో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) ఇప్పటికే ఐదుసార్లు చర్చించింది. ఈ క్రమంలో 6వ సమావేశం శనివారం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. అయినప్పటికీ ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ ప్రొటోకాల్ అంశం కొలిక్కిరాలేదు.
సీడబ్ల్యూసీ ప్రతిపాదనలపై ఇరు రాష్ర్టాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో తదుపరి సమావేశం సోమవారానికి వాయిదా పడింది. ఆ భేటీలో రాష్ర్టాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఆపరేషన్ ప్రొటోకాల్పై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత దాని అమలుకు శాశ్వత రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆర్ఎంసీ ప్రతిపాదించింది. ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిైళ్లె నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CWC proposals
- objection
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

