హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) 39వ వార్షిక సమావేశం ఈ నెల 23న జరుగనున్నది. దీనిలో భాగంగానే ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ స్పెషల్ కమిటీ 24వ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈమేరకు ఎన్‌డబ్ల్యూడీఏ బుధవారం అన్ని రాష్ర్టాల కు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వడంతోపాటు ఎజెండాను కూడా పంపింది. ఈ సమావేశంలో గోదావరి-కావేరి(జీసీ) రివర్ లింక్ ప్రాజెక్టుపై కూడా చర్చించనున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇప్పటికే జీసీ లింక్‌పై కో బేసిన్ రాష్ర్టాలతో పలు దఫాలుగా చర్చించింది.
ప్రాజెక్టు అమలు ముసాయిదా ఒప్పందంపై కూడా చర్చించింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాలు జీసీ లింక్‌పై అభ్యంతరాలు చె ప్పాయి. 23న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో మరోసారి చర్చించనున్నారు. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్‌లో భాగమైన మరో 13 రివర్ లింకింగ్ ప్రాజెక్టులు, ఇంట్రా రివర్ లింక్ ప్రాజెక్టుల పురోగతి, ఎన్‌డబ్ల్యూడీఏ వార్షిక బడ్జెట్‌పై సమీక్షించనున్నారు.