తినే ఆహారంలో పోషకాలు లెక్కించొచ్చు!
అతి సర్వత్రా వర్జయేత్.. అంటారు. అతిగా తినడం అయినా, అతిగా ఉపవాసం ఉండటమైనా మన శరీరానికి కీడే చేస్తాయి.
- కౌంట్ వాట్ యూ ఈట్ పేరిట వెబ్సైట్ ఆధారిత సేవలు
- అభివృద్ధి చేసిన ఎన్ఐఎన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అతి సర్వత్రా వర్జయేత్.. అంటారు. అతిగా తినడం అయినా, అతిగా ఉపవాసం ఉండటమైనా మన శరీరానికి కీడే చేస్తాయి. మనం ఎంత తినాలి? ఏది తినాలి? తినే ఆహారంలో పోషకాలు ఎన్ని ఉన్నాయి? ఆహారంలో పోషకాలను లెక్కించే విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిం ది. పోషకాహార ప్రాధాన్యం, తీసుకొనే ఆహారంలో ఉండే పోషక విలువలు, బాడీమాస్ ఇండెక్స్, అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘కౌంట్ వాట్ యూ ఈట్’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నిపుణులు అభివృద్ధి చేశారు.
గాడితప్పిన జీవనశైలి, పోషకరహిత ఆహారాలతోనే హైబీపీ, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పోషకాహార లోపాన్ని నియంత్రించేలా, ఆధునిక జీవనశైలికి అనుకూలమైన ఆహార పదార్థాలు, పోషకాలపై అవగాహన కల్పించేలా కౌంట్ వాట్ యూ ఈట్ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ పోషకాహార ప్రమాణాలు, క్యాలరీ, బీఎంఐ, బీఎంఆర్, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, హెల్త్ కాలిక్యులేటర్ వంటి సేవలను పొందుపరిచి అందుబాటులోకి తీసుకొచ్చారు.
పోషకాల కాలిక్యులేటర్
కౌంట్ వాట్ యూ ఈట్లో ఒకసారి నమోదు చేసుకోగానే.. పోషకాలను లెక్కించుకొనే వీలు ఉంటుంది. బీఎంఐ, క్యాలరీ కాలిక్యులేటర్, వయస్సు, శారీరక పనితీరును బట్టిని అవసరమైన పోషకాలను లెక్కించడంతోపాటు ఎంత పరిమాణంలో సూక్ష్మ పోషకాలను తీసుకోవాలనే విషయాన్ని గణాంకాలతో సహా చూపుతుంది. వ్యాయా మం చేసే పురుషుడికి కావాల్సిన పోషకాలను లె క్కించడానికి వివరాలు నమోదు చేయాల్సి ఉం టుంది. రోజువారీ క్యాలరీలు, ప్రోటీన్, ఫ్యాట్, క్యా ల్షియం, ఐరన్, రెటినాల్, బీటా-కెరాటిన్, థయామిన్, రైబోఫ్లెవీన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ బీ6, విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12, జింక్, మెగ్నీషియం, నియాసిన్, ఫోలెట్ వంటి వివరాలతో కూడిన పట్టికను చూపుతుంది.
రోజువారీగా పోషకాహారాన్ని తీసుకోవడం సులభంగా అర్థం చేసుకొనేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్), బీఎంఆర్ (బాసల్ మెటాబాలిక్ రేట్), ఐడియల్ వెయిట్, క్యాలరీ క్యాలికేటర్లనూ పొందుపరిచారు. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత అన్ని సేవలను పొందవచ్చని ఎన్ఐఎన్ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

