మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి
వినియోగదారుల వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించాలని హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ పిలుపునిచ్చారు.
- హైకోర్టు తాత్కాలిక చీఫ్‌జస్టిస్ శ్యాంకోశీ
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించాలని హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ పిలుపునిచ్చారు. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాన్ని పరిషరించడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘వినియోగదారుల వివాదాల పరిషారంలో మధ్యవర్తిత్వం-ఆచరణాత్మక దృక్పథంలో అవగాహన’ అనే అంశంపై హైదరాబాద్‌లోని ఏరువాక భవనంలో రాష్ట్ర వినియోగదారుల కమిషన్, బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
మధ్యవర్తిత్వాన్ని న్యాయవిచారణకు ముందు నిర్వహించే అనవసర ప్రక్రియగా న్యాయవాదులు, కక్షిదారులు భావిస్తున్నారని, ఈ దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం వినియోగదారుల వివాదాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిషారమైన ఓ కేసులో లబ్ధిదారుడికి రూ.12. 31 లక్షల చెకు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, రిజిస్ట్రార్ సత్యేంద్ర పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

