హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు ఎంపికైన 332మంది మంగళవారం ప్రజాభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు.
వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో పోస్టింగ్ ఎక్కడ వస్తుందో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు.