Nilamala Forest | అమ్రాబాద్, సెప్టెంబర్ 9: నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవిలో పులుల సంఖ్య పెరిగినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 2023-24 ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేటింగ్ అథారిటీ) నివేదిక ప్రకారం 60 శాతం పెరిగినట్టు సీఎఫ్, ఎఫ్డీ శివాణిడోగ్రా, నాగర్కర్నూల్, నల్లగొండ డీఎఫ్వోలు రోహిత్ గోపి, రాజశేఖర్ సోమవారం వెల్లడించారు.
ఏటీఆర్లో 2100 చదరపు కిలోమీటర్లలో అమర్చిన 1806 ట్రాప్ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు గతంలో 21 పులులు కాకుండా 13 కొత్త పులులను గుర్తించినట్టు తెలిపారు. ఇందులో 11 మగ పులులు, 15 ఆడ పులు లు, 8 చిన్న పులిపిల్లలు ఉన్నాయని చెప్పారు.