హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఏపీ మంత్రి నారా లోకేశ్ సోష్ల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తంచేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించిన ఓ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కట్టడాలు దెబ్బతిన్నాయని, మరమ్మతులు ఎందుకు చేయలేదని, ప్రభుత్వ నిధులతోనే మరమ్మతులు చేయాలని లోకేశ్ గతంలో ఓ పోస్ట్ పెట్టారు.
తాజాగా స్పందించిన రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో హెచ్ఎండీఏ రూ.1.3 కోట్లు మంజూరు చేసింది. దీంతో అధికారులు హడావుడిగా పనులు చేపట్టారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో తెలంగాణవాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. లోకేశ్‌కు కోపం రాగానే ప్రజాధనాన్ని ఎలా మంజూరు చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.