9999 నంబర్‌ను దక్కించుకున్న జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజీలో మరో లగ్జరీ కారు కొలువుదీరింది. అది ‘లంబోర్గినీ ఉర్స్’ అని తెలుస్తున్నది. దీని కోసం ఆయన బుధవారం ఫ్యాన్సీ నంబర్ల వేలంలో పాల్గొని రూ.17 లక్షలతో టీఎస్09ఎఫ్ఎస్ 9999 నంబర్‌ను దక్కించుకున్నాడు. రాష్ట్ర రవాణా శాఖ చరిత్రలో ఇదే అత్యధికం. గతంలో ఓ వ్యాపారవ్తే రూ.12 లక్షలతో ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నాడు. టీఎస్09ఎఫ్టీ 0001 ఫ్యాన్సీ నంబర్‌ను రూ.7.1 లక్షలతో లహరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, టీఎస్09ఎఫ్టీ0009 నంబర్‌ను రూ.3.76 లక్షలకు రతన్ అనే వ్యక్తి దక్కించుకోవడం.. ఇతర ఫ్యాన్సీ నంబర్లకూ మంచి ధర లభించ డంతో రవాణాశాఖ ఖజానాకు ఒక్కరోజే రూ.46 లక్షలు వచ్చాయి.