గార్ల, ఫిబ్రవరి 27: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస భారతీయులు, రాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ పులి గోపాల్‌రెడ్డి, ప్రమీల దంపతులు రూ.1.05 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమ కోర్కెలు నెరవేరడంతో విరాళాన్ని ప్రకటించినట్టు వారు పేర్కొన్నారు. తాము ప్రకటించిన విరాళం మొత్తాన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు.