న్యూఢిల్లీ, అక్టోబర్ 18 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హీరా గోల్డ్’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివిధ రాష్ర్టాల్లోని దాదాపు 1.72 లక్షల మంది నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్‌కు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. 5 షరతులతో నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో దేన్ని అతిక్రమించినా బెయిల్ రద్దవుతుందని అప్పట్లోనే స్పష్టం చేసింది. కానీ, ఆ షరతులు అమలు కాలేదని పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నౌహీరా షేక్ బెయిల్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గత షరతులన్నీ వర్తిస్తాయని, ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు వెల్లడించింది.