OU | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ విడుదల చేశారు. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మందిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్సిటీలోని ఎలక్ట్రికల్ సెక్షన్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. 6న నామినేషన్లను పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణను 7న అవకాశం కల్పించామని, అర్హులైన నామినేషన్ల జాబితాను అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల 10న నాన్ టీచింగ్ హోంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్లను లెక్కించి, ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.