హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాళోజీ నారాయణ రావు హెల్త్ వర్సిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అభ్యర్థులు https://pvttspgmed.tsche.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈనెల 11 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులకు గడువు విధించింది.