హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరోలో స్పెషల్ పోలీ స్ ఆఫీసర్ (డ్రైవర్)ల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తూ టీజీ న్యాబ్ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 34 మంది అభ్యర్థులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా తీసుకునేందుకు మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ దళాలు, తెలంగాణ పోలీస్ శాఖ లో రిటైర్డ్ అయిన వారి నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించారు.
అభ్యర్థులు తెలంగాణకు చెం దిన వారై ఉండాలని, ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరని, మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ సిబ్బంది వయసు ఈ నెల 30 నాటికి 58 ఏండ్లకు మించొద్దని తెలిపారు. గౌరవ వేతనం రూ.26 వేలు ఇస్తారని, సెలవులు ఉండవని స్పష్టంచేశారు. అత్యవసర సందర్భాల్లో గౌరవ వేతనం ఇవ్వకుండా సెలవు ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని డైరెక్టర్ తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరోకు పంపాలని, దరఖాస్తులకు ఈ నెల 20 ఆఖరు తేదీ అని పేర్కొన్నారు.