డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24 డిప్యూటీ ఈవో/గ్రేడ్-1 హెచ్ఎం పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24 డిప్యూటీ ఈవో/గ్రేడ్-1 హెచ్ఎం పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 10, మల్టీజోన్-2లో 14 చొప్పున పోస్టులున్నాయి. మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూలై 19 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.
ఇంకా చదవల్సిన వార్తలు
పీజీ ప్రవేశాల దరఖాస్తుకు 10 వరకు గడువు
హనుమకొండ చౌరస్తా, జూన్ 5: 2026-27 విద్యాసంవత్సరానికి వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘టీజీ సీపీగెట్-2026’ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నదని టీజీ సీపీగెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుముతో, 18 వరకు రూ.2 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదని సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే queries-tgcpget26@ gmail.comకు ఈ-మెయిల్ పంపవచ్చని, కార్యాలయ సమయాల్లో 0870-2934285 నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటివరకు వివిధ పీజీ కోర్సులకు 23,916 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు రాజేందర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

