హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వేర్వేరు కోర్టుధికార కేసుల్లో పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక విద్యార్థికి చెల్లించిన ఫీజు వాపస్ ఇవ్వాలన్న ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఐఐఐటీ హైదరాబాద్ వీసీ, రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ముంబైకి చెందిన ధైర్య ఓంప్రకాశ్ తొలుత 2020లో ఐఐఐటీ హైదరాబాద్‌లో రూ.1,60,000 చెల్లించి బీటెక్ కోర్సులో చేరారు.
తర్వాత ముంబై ఐఐటీలో సీటు రావడంతో హైదరాబాద్‌లో సీటు కాన్సిల్ చేసుకున్నారు. ఆ విద్యార్థికి 12% వడ్డీతో కలుపుకుని ఫీజు వాపస్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలన్న ఉత్తర్వులు అమలు కాలేదని ఓంప్రకాశ్ వేసిన కోర్టు ధికార పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 14కి వాయిదా వేసింది.