రాజగోపాల్‌రెడ్డికి ఈసీ షాక్.. సుశీ కంపెనీ ఖాతాల్లోకి నగదు బదిలీపై నోటీసులు
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.
- నేటి సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ..రాజగోపాల్‌రెడ్డి, ఆయ న కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులు జారీచేసింది. సోమవారం సాయం త్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని, లేకుంటే తగిన నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేసింది. సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు ఈనెల 14,18,29 తేదీల్లో నగదు బదిలీ చేసినట్టు శనివారం ఆధారాలతో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ఖాతాల నుంచి ఎంత నగదు బదిలీ అయ్యిందో వెల్లడించి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

