SIR Enumeration | నత్తనడకన సర్ డిజిటలైజేషన్.. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో సగం కూడా పూర్తికాని లక్ష్యం
SIR Enumeration | రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారమ్ (ఈఎఫ్)ల పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ వాటికి సంబంధించిన ఆన్లైన్ డాటా ఎంట్రీ (డిజిటలైజేషన్) ప్రక్రియ మందకొడిగా నడుస్తున్నది.
SIR Enumeration | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారమ్ (ఈఎఫ్)ల పంపిణీ దాదాపు పూర్తయినప్పటికీ వాటికి సంబంధించిన ఆన్లైన్ డాటా ఎంట్రీ (డిజిటలైజేషన్) ప్రక్రియ మందకొడిగా నడుస్తున్నది. ఆదివారం సాయంత్రం వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయానికి అందిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2,19,23, 435 ఈఎఫ్‌ల (64.81 శాతం) డిజిటలైజేషన్ పూర్తయింది. గ్రామీణ జిల్లాలతో పోలిస్తే ఎకువ ఓటర్లున్న నగర, ఐటీ కారిడార్ పరిధిలోని జిల్లాల్లో ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ మెల్లగా సాగుతున్నది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో అత్యంత తకువగా 37.30% ఈఎఫ్‌లు మాత్రమే డిజిటలైజ్ కాగా, హైదరాబాద్ జిల్లాలో 39.59%, రంగారెడ్డి జిల్లాలో 48.52% ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ పూర్తయింది. వీటితో పోలిస్తే గ్రామీణ జిల్లాలు చాలా ముందంజలో ఉన్నాయి. ఇప్పటివరకు 88.43% ఈఎఫ్‌ల డిజిటలైజేషన్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట (83.55%), నల్లగొండ (82.74%), కుమ్రంభీం ఆసిఫాబాద్ (81.63%) జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య: 3,38,26,448
పంపిణీ చేసిన ఈఎఫ్‌లు: 3,38,26,448 (100%)
డిజిటలైజ్ చేసిన ఈఎఫ్‌లు : 2,19,23,435 (64.81%)
అత్యధికంగా 88.43% ఈఎఫ్‌ల డిజిటలైజేషన్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్
కేవలం 37.30% ఈఎఫ్‌ల డిజిటలైజేషన్‌తో మేడ్చల్ మలాజిగిరి జిల్లా లాస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

