వ్యవసాయ యూనివర్సిటీ, (హైదరాబాద్) జూన్ 23: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన, ఆర్గానిక్ ఎక్స్పో-2025లో ఐసీఏఆర్ నార్మ్ హైదరాబాద్ మొదటి బహుమతిని గెలుచుకున్నదని నార్మ్ డైరెక్టర్ డాక్టర్ గోపాలాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన వేడుకలో కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారులశాఖ సహాయ మంత్రి శ్రీహర్ష్ మల్హోత్రా ఈ అవార్డును ప్రదానం చేశారని ఆయన పేర్కొన్నారు.
ఐసీఏఆర్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఎక్స్‌పోలో ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ డాక్టర్ ఆర్ వెంకటకుమార్, రీసెర్చ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ విభాగం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ శివకుమార్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. నార్మ్ సీటీవోలు డాక్టర్ లక్ష్మణ్ అహిరే, శేఖర్‌రెడ్డి ఎక్స్పో ఎగ్జిబిషన్ స్టాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి సేవలందిస్తున్న 100పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో పాల్గొన్నాయని ఆయన వివరించారు.