నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి 5 కేసుల్లో నాన్-బెయిల్ వారెంట్ జారీచేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులు, గరిడేపల్లి పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం, పదేపదే గైర్హాజరు పిటిషన్లు దాఖలు చేయడం పరిపాటిగా మారిందని జడ్జి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.