హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్‌డ్రాకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఏపీ ఎంపీ బీద మస్తాన్‌రావు, ఒడిశా ఎంపీ సుభాశిశ్ కుంతియా మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు రవిచంద్ర నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన సహచర ఎంపీలను స్వాగతించిన రవిచంద్ర ఆతిథ్యమిచ్చి సత్కరించారు. వీరంతా కాసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు.