హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ పరిధిలో 4వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీలు జారీచేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకు ఇచ్చారన్న కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నది. దీని వెనుక పెద్ద దందా నడిచిందన్న ఆరోపణలున్నాయి. ఈ సీట్లకు అనుమతి ఎవరిచ్చారు.. ఎందుకు ఇచ్చారు.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. దీని ప్రభావం కాలేజీల అఫిలియేషన్లపై పడటంతో సీట్ల సంఖ్య తేలక ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్ వాయిదా పడింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ను జూలై 4కు వాయిదా వేశారు. 2024 -25 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులిచ్చేందుకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ కాలేజీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 138 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. పలు కాలేజీలు సీఎస్ఈ కోర్సులో అదనపు సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. జేఎన్టీయూ అధికారులు సైతం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీ చేశారు. దీనిపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాజాగా గతంలో ఉన్న సీట్లకు ప్రస్తుతం అనుమతినిచ్చి, కౌన్సెలింగ్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఆఫ్ క్యాంపస్‌లకు అనుమతులు లేనట్టే..
ఈ ఏడాది ఆఫ్ క్యాంపస్ కాలేజీకు అనుతివ్వరాదని జేఎన్టీయూ నిర్ణయించింది. అధికారికవర్గాల సమాచారం ప్రకారం బీవీఆర్ఐటీ, వర్ధమాన్ సహా మరో మూడు కాలేజీలు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)తో పాటు సీఎస్ఈ అనుబంధ కోర్సులను నిర్వహించేందుకు దరఖాస్తులు సమర్పించాయి. కొన్ని కాలేజీలు సీఎస్ఈ ఏఐఎంఎల్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీలకు ఇప్పుడు అనుమతిని ఇవ్వరాదని జేఎన్టీయూ నిర్ణయించింది. ఒక కాలేజీ వేరే ప్రాంతంలో మరో బ్రాంచిని తెరువడాన్నే ఆఫ్ క్యాంపస్ కాలేజీలంటారు.
ప్రపంచానికి పెను సవాల్‌గా డ్రగ్స్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తేతెలంగాణ): ఉగ్రవాదం తర్వాత డ్రగ్స్ వినియో గం ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దురలవాటు, అక్రమ రవా ణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలిగించటమేకాక, నైతిక విలువలను దారుణంగా దిగజారుస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల వర కు డ్రగ్స్ చేరటం ఆందోళన కలిగిస్తున్నదని వెల్లడించారు. రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నా రు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ-నాబ్)ను బలోపేతం చేసేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్ తయారీ,రవాణాను నిరోధించేందుకు కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గంజాయి జాడ్యం గ్రామాలకు విస్తరించిందని, యువ త, విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఉమెన్ మాజీ క్రికెటర్ మిథాలీరాజ్, నటుడు సుమన్, యువ నటుడు తేజ సజ్జ, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ ప్రిన్సిపల్ జితేందర్ పాల్గొన్నారు.