Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు రెండో శనివారం(ఏప్రిల్ 12). సాధారణంగా రెండో శనివారం నాడు స్కూళ్లకు హాలిడే. కానీ రేపు వర్కింగ్ డేగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెరిచే ఉండనున్నాయి. మొత్తానికి రెండో శనివారం రద్దయింది.
ఇక ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు సోషల్ స్టడీస్, 8, 9వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.