MBBS | ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు పాత ఫీజులే.. ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీ నివేదిక
రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సు ఏ-క్యాటగిరీ సీట్లకు రూ.60 వేలు, బీ-క్యాటగిరీ సీట్లకు రూ.11.55 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14 లక్షల ఫీజును తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించింది.
MBBS | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సు ఏ-క్యాటగిరీ సీట్లకు రూ.60 వేలు, బీ-క్యాటగిరీ సీట్లకు రూ.11.55 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14 లక్షల ఫీజును తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఫీజుల సవరణకు సంబంధించిన ప్రతిపాదనలను టీఏఎఫ్ఆర్సీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. ఏ- క్యాటగిరీ ఫీజులు దాదాపు పాతవే కొనసాగించాలని ప్రతిపాదించారు. బీ-క్యాటగిరీ ఫీజులు రెండు కాలేజీల్లో తగ్గించగా, మరో రెండు కాలేజీల్లో కాస్త పెరగనున్నాయి. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే మూడు, నాలుగు రోజుల్లోనే జీవో జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 2023-26 విద్యా సంవత్సరాలకు మెడికల్ ఫీజులను ఖరారు చేసేందుకు టీఏఎఫ్ఆర్సీ ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 23 మెడికల్, 12 డెంటల్ కాలేజీలు తమ విద్యాసంస్థలకు చెందిన ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తోపాటు, ఫీజుల సవరణకు ప్రతిపాదనలను సమర్పించాయి. వాటిని పరిశీలించిన అధికారులు.. ఆడిటర్ల చేత తనిఖీలు చేయించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వాస్తవికంగా 2022-23 విద్యా సంవత్సరంలోనే మెడికల్ కోర్సుల ఫీజులను సవరించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో మినహాయింపునిచ్చారు.
- బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్) కోర్సుల ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కోర్సులకు ఏ క్యాటగిరీ ఫీజులు రూ.45 వేలు ఉండగా, బీ క్యాటగిరీలో రూ.4.20 లక్షలుగా ఉండగా, పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించారు.
- మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (ఎండీఎస్) కో ర్సుల ఫీజు గతంలో ఉన్నట్టుగానే ఈ ఏడా ది కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
- ఎంబీబీఎస్ ‘సీ’ క్యాటగిరీ సీట్ల ఫీజులు ‘బీ’ క్యాటగిరీ ఫీజుల కంటే రెండురెట్లు మించకుండా ఉండాలి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

