వినాయక్‌నగర్/హుజూరాబాద్, అక్టోబర్ 19: వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌నకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు భార్య అనారోగ్యంతో బాధ పడుతుండగా.. శుక్రవారం ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తీసుకొచ్చాడు. వైద్య పరీక్షల సమయం దాటిపోవడంతో రాత్రి అక్కడే ఉన్నారు.
దవాఖాన ప్రాంగణంలోని ఓ షెడ్డు కింద రాజు భార్య, ఇద్దరు పిల్లలతో నిద్రపోయాడు. అర్ధరాత్రి మెళకువ రాగా.. ఏడాది బాబు మణికంఠ కనిపించలేదు. దవాఖాన అంతటా వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దవాఖానలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుల ఆనవాళ్లు దొరికాయి. మహిళ, యువతి, బాలిక ముగ్గురు కలిసి బాలుడిని ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
బాలుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన ఓ బాలిక (16) కిడ్నాప్‌నకు గురైంది. శుక్రవారం సాయంత్రం కిరాణా షాపునకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.