నిమ్స్‌కు 2.1 కోట్ల విరాళం
పిల్లల సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపన, క్రెష్ సౌకర్యాల పునరుద్ధరణ లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ రూ. 2.1 కోట్ల విరాళం అందజేసింది.
కొండాపూర్, జూలై 1 : పిల్లల సంరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపన, క్రెష్ సౌకర్యాల పునరుద్ధరణ లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ రూ. 2.1 కోట్ల విరాళం అందజేసింది.
సోమవారం మాదాపూర్‌లోని ఓ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, నిమ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో శరత్‌చౌదరి, జ్ఞాన్‌ప్రకాశ్, చరణ్జీవ్ సలుజా పాల్గొన్నారు.
‘నిమ్స్‌మే’ వ్యవస్థాపక దినోత్సవం
హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్‌మే) 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఐపీఎఫ్‌సీ(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్) లబ్ధిదారుకు సంబంధించి ‘భారతీయ మసాలా పరిశ్రమ సవాళ్లు, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారాలు’ అనే అంశంపై కేస్ స్టడీని విడుదల చేశారు. నిమ్స్మేతోపాటు ఇన్నోవేటర్ పీఎస్ఆర్వీఎస్ విఠల్ దీన్ని రచించారు. సియంట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్ రెడ్డి, నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ స్వరూప, ఐపీఎఫ్‌సీ అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ స్వప్న పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

