బెంగళూరు, డిసెంబర్ 25: మైసూరు ప్యాలెస్ సమీపంలో నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బెలూన్లు విక్రయించే ఓ వ్యక్తి, వాటిని నైట్రోజన్ వాయువుతో నింపుతుండగా పేలుడు సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
గురువారం రాత్రి ప్యాలెస్ జయమార్తాండ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని ఆర్కే దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో నగరంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.